దోమలపై జాగృతికి సూచన | Sakshi
Sakshi News home page

దోమలపై జాగృతికి సూచన

Published Fri, Nov 10 2023 5:14 AM

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం  - Sakshi

రాయచూరు రూరల్‌: జిల్లా వ్యాప్తంగా దోమల నివారణపై ఇంటింటికీ వెళ్లి ముమ్మర ప్రచారం చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు వైద్యులను ఆదేశించారు. గురువారం కవితాళ పీహెచ్‌సీలో తనిఖీ చేసి ఆయన మాట్లాడారు. ఇళ్ల సరిసరాల్లో శుభ్రత పాటించేలా సూచించాలన్నారు. ప్రతి ఒక్కరి నుంచి రక్త పరీక్షలు జరిపి ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు.

మౌలిక సౌకర్యాలు కల్పించరూ..

రాయచూరు రూరల్‌: ఏపీఎంసీలో పని చేస్తున్న హమాలీలు, కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని హమాలీ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం ఏపీఎంసీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మాట్లాడారు. మార్కెట్‌లో తాగునీటి సౌకర్యం, శౌచాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులకు ఆరు నెలలపాటు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని కోరుతూ ఏపీఎంసీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.

పడకేసిన నిఘానేత్రం

కంప్లి: కొట్టూరు బస్టాండ్‌లో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలు ఏడాది నుంచి మూతపడ్డాయి. మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. సమయానికి గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేక చీకటి పడేంత వరకు విద్యార్థినులు, మహిళలు బస్టాండ్‌లోనే పడిగాపులు పడే దుస్థితి నెలకొన్నందున పాడైన సీసీ కెమెరాలను రిపేరీ చేయించాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు.

శిష్యవేతనాల విడుదలకు వినతి

రాయచూరు రూరల్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం శిష్యవేతనాలు విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమేష్‌ మాట్లాడారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ప్రభుత్వం శిష్యవేతనం చెల్లింపులో జాప్యం చేయడాన్ని ఖండించారు. వ్యవసాయ, ఆయుష్‌, సాంఘీక సంక్షేమ, విద్యా శాఖల ఆధీనంలోని విద్యార్థులు గత ఆరు నెలల నుంచి స్కాలర్‌షాప్‌లు లేక తల్లడిల్లిపోతున్నారన్నారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని పెండింగ్‌లో ఉన్న శిష్యవేతనాలను అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఉపకార వేతనాల్లో

కోత తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని కట్టడ కార్మికుల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న శిష్య వేతనాల్లో కోతలు విధించడం తగదని టీయూసీఐ డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమరేష్‌ మాట్లాడారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కలికా పథకంలో అందిస్తున్న శిష్య వేతనంలో కోత విధించారన్నారు. కోత విధించకుండా శిష్య వేతనాలు అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
1/3

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

వైద్యులకు సూచనలిస్తున్న దృశ్యం
2/3

వైద్యులకు సూచనలిస్తున్న దృశ్యం

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
3/3

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

Advertisement
Advertisement