ఎల్లమ్మ గుడికి తాళం వేసిన వారిపై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ గుడికి తాళం వేసిన వారిపై ఫిర్యాదు

Published Sat, May 25 2024 12:10 AM

ఎల్లమ

శంకరపట్నం: మండలంలోని కరీంపేటలో ఎల్లమ్మ గుడిలోపలికి దళితులను ప్రవేశించకుండా తాళం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ అనుపమ, ఎస్సై లక్ష్మారెడ్డికి దళితులు గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడిలోనికి మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి వెళ్లగా లోనికి వెళ్లకుండా గౌడ కులస్తులు గుర్రం భిక్షపతి, గుర్రం తిరుపతి, తాళం వేశారని, తాళం ఎందుకు వేశారని ప్రశ్నించగా గుడిని మేమే కట్టించుకున్నాము, గుడి ఎదుట కొబ్బరి కాయలు కొట్టుకోవాలని సమాధానం ఇచ్చారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సముద్రాల సంపత్‌, భద్రయ్య, శ్రీనివాస్‌, నర్సయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రేచపల్లిలో శ్రీగంధం తోట దగ్ధం

సారంగాపూర్‌: మండలంలోని రేచపల్లిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీగంధం చెట్లు శుక్రవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఎడమల తిరుపతిరెడ్డి, పాకాల నడిపి నర్సయ్య, పాకాల చిన్నమల్లయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ ముగ్గురూ శ్రీగంధం చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. తిరుపతిరెడ్డి తన మూడు ఎకరాల విస్తీర్ణంలో 900 చెట్లను నాటాడు. పాకాల నడిపినర్సయ్య, చిన్నమల్లయ్య రెండు ఎకరాల్లో చెట్లను పెంచుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని, ముగ్గురికి చెందిన చెట్లు కాలిపోయాయి. తిరుపతిరెడ్డికి రూ.15 లక్షల వరకు, నర్సయ్య, మల్లయ్యలకు రూ.15లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు.

తీసుకున్న అప్పు చెల్లించడం లేదని వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని మిషన్‌ కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన కొయ్యాల రతన్‌రాయల్‌(58) అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించడం లేదని శుక్రవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2021లో రతన్‌రాయల్‌ వైజాగ్‌ షిప్‌యార్డ్‌లో కర్ర శ్రీనివాసమూర్తితో పనిచేశాడు. రతన్‌రాయల్‌ భార్య కొయ్యాల విజయశీల పేరిట కర్ర శ్రీనివాసమూర్తి మంచిర్యాలలో ఉన్న భూమిని మార్టిగేజ్‌ చేసి దశలవారీగా రూ.45 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొద్దిరోజులుగా అప్పు చెల్లించకపోవడంతో పాటు, మార్టిగేజ్‌ చేసిన భూమిని వీరికి తెలియకుండా ఇతరులకు విక్రయించాడు. మనస్తాపానికి గురైన రతన్‌రాయల్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య విజయశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

ఎల్లమ్మ గుడికి తాళం   వేసిన వారిపై ఫిర్యాదు
1/1

ఎల్లమ్మ గుడికి తాళం వేసిన వారిపై ఫిర్యాదు

Advertisement
 
Advertisement
 
Advertisement