‘ఫసల్‌ బీమా’పై అవగాహన కల్పించండి | Sakshi
Sakshi News home page

‘ఫసల్‌ బీమా’పై అవగాహన కల్పించండి

Published Thu, May 23 2024 12:30 AM

‘ఫసల్‌ బీమా’పై అవగాహన కల్పించండి

కరీంనగర్‌ అర్బన్‌: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కరీంనగర్‌లోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో ఈ పథకంపై ఉమ్మడి జిల్లా వ్యవసాయ, జిల్లా ముఖ్య ప్రణాళిక, ఉద్యానవన అధికారులు, ప్రోగ్రెసివ్‌ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఫసల్‌ బీమా యోజన ద్వారా పరిహారం అందుతుందని పేర్కొన్నారు. అన్నదాతలు బీమా చెల్లించే అవసరం లేదని, ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయన్నారు. అధికారులు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటూ సూచనలు ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయం, సాగులో ఆధునాతన పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. జేడీఏ బాలునాయక్‌ ఫసల్‌ బీమా యోజనపై అవగాహన కల్పించారు. మాస్టర్‌ ట్రైనర్లు మమత, ప్రతిభ, భూంరెడ్డి దీనిపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా సీపీవోలు కొమురయ్య, పీబీ.శ్రీనివాస్‌, పూర్ణచందర్‌రావు, షబానా సుల్తానా, ఉద్యానవన అధికారులు శ్రీనివాస్‌, జ్యోతి, ప్రతాప్‌సింగ్‌, జగన్మోహన్‌రెడ్డి, ఆయా జిల్లాల వ్యవసాయ అధికా రులు శ్రీనివాస్‌, ఆదిరెడ్డి, భాస్కర్‌, వాణి, ఏడీఏ లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

కేడీసీసీ బ్యాంకు సందర్శన

కరీంనగర్‌ కేడీసీసీ బ్యాంకును కలెక్టర్‌ పమేలా సత్ప తి సందర్శించారు. బ్యాంకు, పీఏసీఎస్‌ల పనితీరు తెలుసుకున్నారు. ఈ బ్యాంకు దేశంలోనే రోల్‌ మో డల్‌గా నిలిచిందని సీఈవో సత్యనారాయణ కలెక్టర్‌కు వివరించారు. చొప్పదండి పీఏసీఎస్‌ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందన్నారు. జీఎంలు ప్రభాకర్‌ రెడ్డి, ఉషశ్రీ, పీఏసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ రి సోర్స్‌పర్సన్‌ సత్యనారాయణ తదితరులున్నారు.

పంటల వివరాలు

పక్కాగా నమోదు చేయాలి

కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి

Advertisement
 
Advertisement
 
Advertisement