చోరీ కేసులో ఒకరి అరెస్టు | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఒకరి అరెస్టు

Published Thu, May 23 2024 12:30 AM

-

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌): నిజామాబాద్‌ నగరంలోని నాలుగో టౌన్‌ ఠాణా పరిధిలోని షిర్డీ సాయినగర్‌లో చోరీకి పాల్పడిన ఒకరిని అరెస్టు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ విజయ్‌బాబు తెలిపారు. ఈ నెల 4న మధ్యాహ్నం షిర్డీ సాయినగర్‌కు చెందిన దాచ మధుసూదన్‌ ఇంట్లో పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌ మ ండలం మడిపల్లికి చెందిన శివకుమార్‌ రెండున్నర తులాల బంగారం, కిలో వెండి చోరీ చేశాడు. బుధవారం నిజామాబాద్‌ బస్టాండ్‌లో అతన్ని అదుపులో కి తీసుకొని, విచారించగా నేరం ఒప్పుకున్నాడు. శివకుమార్‌ను రిమాండ్‌ చేశామని, అతనికి విజ య్‌కుమార్‌ సహకరించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement