అనాథ శవానికి అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

అనాథ శవానికి అంత్యక్రియలు

Published Tue, Jan 2 2024 12:30 AM

అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తున్న  అక్కెనపల్లి భాస్కర్‌ - Sakshi

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో అనాథ శవానికి అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటారు యువకులు. గాంధీనగర్‌లో చాలా ఏళ్లుగా పాకాల లచ్చవ్వ(50) కూలీ పనిచేసుకుంటూ బతుకుతుంది. సోమవారం ఉదయం ఇంట్లోనే ఫిట్స్‌ వచ్చి మరణించింది. విషయం తెలుసుకున్న భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆపద్భాంధవ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అక్కెనపల్లి భాస్కర్‌, కూరగాయల శ్రీనివాస్‌, మల్లేశం, ప్రశాంత్‌, నవీన్‌, వికాస్‌ తదితరులు చందాలు పోగుచేశారు. స్థానిక కౌన్సిలర్‌ గుండ్లపెల్లి నీరజపూర్ణచందర్‌ సాయంతో విద్యానగర్‌ వైకుంఠథామంలో అంత్యక్రియలు జరిపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement