మాదక ద్రవ్యాల కేసులపై అవగాహన | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల కేసులపై అవగాహన

Published Sun, Nov 19 2023 1:20 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: ఉమ్మడి జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు బాలల లైంగిక వేధింపుల చట్టం(ఫోక్సో), మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కేసులపై డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీనర్సయ్య శనివారం అవగాహన కల్పించారు. జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించారు.ఆర్ధిక నేరాలు, వైట్‌ కాలర్‌ చట్టంపై బోధన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ సమ్మయ్య వివరించారు. సమావేశంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవిరాజ్‌, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు బంటు వసంత్‌, నంద రమేశ్‌, జి. శ్యాంరావు, కావేటి శేషు, అందె శ్రీనివాస్‌, నిమ్మ దామోదర్‌ రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

కార్యకర్తల మధ్య ఘర్షణ

గాంధారి

(ఎల్లారెడ్డి): మండలంలోని గండివేట్‌లో శనివారం రాత్రి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన హైమద్‌, జావీద్‌, రజాక్‌పై కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు కత్తితో దాడిచేసి గాయపర్చినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో నుంచి తమను ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. కత్తిపోట్లకు గురైన బాధితులను బాన్స్‌వాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆసుపత్రిలో బాధితులను పరా మర్శించారు. అందులో హైమద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ జిల్లాస్పత్రికి తరలించారు. బాధితుల వెంట ఎమ్మెల్యే జాజాల నిజామాబాద్‌కు వెళ్లారు. దాడి విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సర్పంచ్‌ ఫారూఖ్‌ తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై ప్రేమ్‌దీప్‌ను సంప్రదించగా గండివేట్‌లో కత్తిపోట్లు జరిగాయని, భీందాస్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారని విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ముగ్గురికి కత్తిపోట్లు

గండివేట్‌లో కత్తిపోట్లకు గురైన బాధితులు
1/2

గండివేట్‌లో కత్తిపోట్లకు గురైన బాధితులు

2/2

Advertisement
Advertisement