స్కూల్‌ స్థాయి నుంచి టాపరే.. | Sakshi
Sakshi News home page

స్కూల్‌ స్థాయి నుంచి టాపరే..

Published Mon, May 20 2024 9:45 AM

-

హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రికల్చర్‌, ఫార్మసీలో (హాల్‌ టికెట్‌ నంబర్‌ 2411ఆర్‌09048, మార్కులు 145.255026) రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అప్పటి వరకు ఇరుగుపొరుగు వారికి అంతంత మాత్రంగానే తెలిసిన శ్రీవర్షిణి సింగిల్‌ డిజిట్‌ ర్యాంక్‌ సాధించడంతో కాలనీవాసుల అభినందనలతో తల్లిదండ్రులు మురిసిపోయారు. గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె శ్రీవర్షిణి, కుమారుడు ఫణితేజ. ఫణితేజ కర్ణాటకలోని ధార్‌వాడలో ఐఐటీ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కన్నయ్య ప్రైవేట్‌ సంస్థలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తుండగా.. తల్లి లావణ్య గృహిణి. శ్రీవర్షిణి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివి 10/10 మార్కులు సాధించింది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడిఝెట్‌ చదివి 987 మార్కులు తెచ్చుకుంది. శ్రీవర్షిణి ఇటీవల నీట్‌ రాసింది. అందులోనూ 200లోపు ర్యాంక్‌ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement