కార్తీక పురాణం చదివితే సకలశుభాలు | Sakshi
Sakshi News home page

కార్తీక పురాణం చదివితే సకలశుభాలు

Published Mon, Nov 20 2023 1:08 AM

దేవాలయ ప్రాంగణంలో కార్తీక వన భోజనాలు - Sakshi

హన్మకొండ కల్చరల్‌: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో కార్తీకపురాణం చదివినా, విన్నా సకల శుభాలు కలుగుతాయని, కార్తీక వనభోజనం ఆచరించడం ఆరోగ్యదాయకమని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచికట్ల గోపీనాఽథ్‌ దంపతుల సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో ఉసిరిక పూజలు, కార్తీకసమారాధన నిర్వహించారు. వందలాది మంది భక్తులు కార్తీక వనభోజనాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. పూజల్లో తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేశ్‌ పాల్గొన్నారు. సాయంత్రం వేదపండితుల ఆధ్వర్యంలో పుట్టమట్టితో తయారు చేసిన శివలింగాలకు ఆవుపాలతో, గంధోదకములతో సహస్రలింగార్చన నిర్వహించారు.

రుద్రేశ్వరాలయ ప్రధానార్చకులు

ఉపేంద్రశర్మ

ఘనంగా ఉసిరిక పూజలు,

కార్తీక వనభోజనాలు

దేవాలయంలో సహస్ర లింగార్చన
1/1

దేవాలయంలో సహస్ర లింగార్చన

Advertisement
Advertisement