అవగాహనతో అగ్ని ప్రమాదాల నివారణ | Sakshi
Sakshi News home page

అవగాహనతో అగ్ని ప్రమాదాల నివారణ

Published Sat, May 25 2024 3:55 PM

అవగాహనతో అగ్ని ప్రమాదాల నివారణ

ప్రదర్శనతో వివరించిన సిబ్బంది

జనగామ: అవగాహనతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నా రు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో శుక్రవారం అవగా హన సదస్సులు, ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌, పేలుడు పదార్థాలతో పాటు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు పెట్రోలు, డీజిల్‌ నిల్వ చేసే ప్రదేశాలల్లో ఎక్కువగా చోటుచేసుకునే అగ్ని ప్రమాద ఘటనలకు సంబంధించి నివారణపై సిబ్బంది ప్రదర్శన ద్వారా వివరించారు. ఆస్పత్రుల్లో పనిచేసే ప్రతీ ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైర్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది చేరుకునే లోపు అందుబాటులో ఉన్న ఆస్పత్రి సిబ్బంది స్పందిస్తే ప్రాథమిక దశలోనే మంటలను వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హరీశ్‌రాజు, డీఐఓ డాక్టర్‌ మహేందర్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ రవీందర్‌గౌడ్‌, మాస్‌ మీడియా అధికారి ఎం.ప్రభాకర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement