ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి● | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి●

Published Sat, May 25 2024 3:55 PM

ఉపాధి

బచ్చన్నపేట: ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల్లో కూలీల సంఖ్యను మరింత పెంచాలని డీఆర్‌డీఓ మొగులప్ప అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీడీఓ రఘురామకృష్ణతో కలిసి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఈజీఎస్‌ కూలీలకు ఉపాధి పథకంలో పని కల్పించాలన్నారు. కూలీలు రోజుకు నాలుగు గంటలు తప్పనిసరిగా పనిచేస్తేనే ప్రభుత్వం నిర్ణయించిన వేతనం గిట్టుబాటు అవుతుందని చెప్పారు. పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని తెలిపారు. కొలతల ప్రకారం పనులు జరిగేలా చూస్తూ మస్టర్లను ప్రతీ వారం కార్యాలయంలో అందించడంతోపాటు కూలీల డబ్బులు సకాలంలో పడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దుకాణాల్లో

స్టాక్‌ వివరాలు ఉండాలి

బచ్చన్నపేట : ఎలక్ట్రికల్‌, హార్డ్‌వేర్‌ దుకాణాల్లో స్టాక్‌ వివరాలను తప్పకుండా రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి వి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హార్డ్‌వేర్‌, ఎలక్ట్రికల్‌ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ షాపుల్లోని స్టాక్‌ వివరాలు, వస్తువుల గరిష్ట చిల్లర ధర, తయారీ చిరునామా, నెల, సంవత్సరం, కస్టమర్‌ కేర్‌ వివరాలు ఏమీ లేవని చెప్పారు. ఇంతకు ముందు తనిఖీ చేసిన సమయంలో హెచ్చరించినా రికార్డులు రాయలేదని, ఆయా దుకాణాలపై ఆరు కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికై నా వివరాలను నమోదు చేయకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షలు షురూ

జనగామ రూరల్‌: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగి న పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 492 మందికి 464, ఒకేషనల్‌ 280 మందికి 257 మంది, మధ్యాహ్నం పరీక్షకు జనరల్‌ 264 మందికి 251, ఒకేషనల్‌ 77 మందికి 76 మంది హాజరైనట్లు ఇంటర్‌ విద్యాధికారి ఆంజనేయరాజు తెలిపారు.

నీటి పారుదలశాఖ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా ఓంకార్‌ సింగ్‌

హసన్‌పర్తి: నీటి పారుదలశాఖ వరంగల్‌ సర్కి ల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా ఓంకార్‌సింగ్‌ను నియమించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా కొనసాగుతున్న మహబూబాబాద్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు ను ఆ బాధ్యత నుంచి తప్పించడంతో రామగుండం నీటిపారుదల శాఖ డివిజన్‌–3లో ఈఈగా వ్యవహరిస్తున్న ఓంకార్‌సింగ్‌కు వరంగల్‌ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన ను టీఎన్జీఓస్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపా రు. టీఎన్జీఓస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాజమౌళి, టీఎన్జీఓస్‌ హసన్‌పర్తి యూనిట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, సభ్యులు నవీన్‌ పాల్గొన్నారు.

పోలింగ్‌ రోజున 144 సెక్షన్‌

వరంగల్‌ క్రైం: ఈనెల 27న జరిగే వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు వరంగల్‌ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని, పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రావొద్దని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరా రు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి●
1/1

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి●

Advertisement
 
Advertisement
 
Advertisement