మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలి | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలి

Published Sat, May 25 2024 3:55 PM

మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలి

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

జనగామ రూరల్‌: మహిళలు ఆర్థిక ప్రగతి సాఽధించాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. జనగామ మండలం పెంబర్తి మహిళా మండలి భవనంలో స్కూల్‌ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి దుస్తులు విద్యార్థులకు అందేలా చూడాలని, స్టిచ్చింగ్‌లో నాణ్యత పాటించాలని సూచించారు. సిద్ధమైన యూనిఫాంను విద్యార్థికి ధరింపజేసి పరిశీలించారు. డీఆర్‌డీఓ మొగులప్ప మాట్లాడుతూ.. 3,117 యూనిఫాంలు కుట్టించి ఇవ్వడానికి సిద్దెంకి, పెద్దపహడ్‌, చౌడారం, పెంబర్తి కేంద్రాల్లో ఇచ్చామని, ఇప్పటి వరకు 800 దుస్తులు సిద్ధమయ్యాయని చెప్పారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలో తాగు నీటి సదుపాయం కోసం చేపట్టిన పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్‌కుమార్‌, ఏపీఎం కవిత, సీసీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement