యూనిఫాం కుట్టుకేంద్రాల పరిశీలన | Sakshi
Sakshi News home page

యూనిఫాం కుట్టుకేంద్రాల పరిశీలన

Published Sun, May 26 2024 3:10 AM

యూనిఫ

జగిత్యాల: మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం కుట్టే బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళాసంఘాలు కుడుతున్న యూనిఫాం కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి ముందే దుస్తులు అందించేలా చూడాలని, అవసరమైతే రోజుకు రెండుషిఫ్ట్‌లు పనిచేయాలని సూచించారు. గ్రామీణ మండలాల వారికి 1,20,822, పట్టణ పరిధిలో వారికి 40,941 మొత్తం 1,61,763 యూనిఫాంలు కుట్టి ఇవ్వాలన్నారు. ఆమె వెంట డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, మెప్మా ఏవో శ్రీనివా్‌స్‌, డీఎంసీ సునీత, టీఎంసీ రజిత పాల్గొన్నారు.

ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలి

అడిషనల్‌ కలెక్టర్‌ రాంబాబు

వెల్గటూర్‌: రైస్‌మిల్లర్లు త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు ఆదేశించారు. శనివారం మండలంలోని రైస్‌మిల్లులను సందర్శించారు. వెంటవెంటనే దిగుమతి చేసుకోకుంటే కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడుతుందని, సెంటర్లలో ధాన్యం పేరుకుపోతుందని, అకాలవర్షం కురిస్తే తడిచి రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. సివిల్‌ సప్‌లై జిల్లా మేనేజర్‌ హతీరాం, తహసీల్దార్‌ శేఖర్‌, సివిల్‌ సప్‌లై నాయబ్‌ తహశీల్దార్‌ శ్రీనివాస్‌, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి

పెగడపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులే విక్రయించాలని దుకాణ దారులను జిల్లా వ్యవసాయాధికారి వాణి ఆదేశించారు. మండలంలోని బతికపల్లి, పెగడపల్లి, సహకార సంఘం ఎరువులు, విత్తన దుకా ణాలను శనివారం పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. విత్తనాలు విక్రయించిన రైతులకు బిల్లులు ఇవ్వాలని, విడి విత్తనాలు విక్రయించొద్దని సూచించారు. వ్యవసాయ అధికా రుల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని, వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన దుకాణాల్లోనే సరకులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నాసిరకం మందులు, నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తే దుకాణాల గుర్తింపును రద్దు చేయడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. మండల వ్యవసాయాధికారి వినీల ఆమె వెంట ఉన్నారు.

రసాయన ఎరువులు వాడొద్దు

జగిత్యాలఅగ్రికల్చర్‌: పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పొలాస వ్యవసాయ కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్‌ డీన్‌ ఝాన్సీరాణి అన్నారు. శనివారం కళాశాలలో రైతులకు జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. రసాయన ఎరువుల ద్వారా భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్‌ ఆర్‌.సుష్మాదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సాయికుమార్‌, ఎల్లాగౌడ్‌, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

యూనిఫాం   కుట్టుకేంద్రాల పరిశీలన
1/2

యూనిఫాం కుట్టుకేంద్రాల పరిశీలన

యూనిఫాం   కుట్టుకేంద్రాల పరిశీలన
2/2

యూనిఫాం కుట్టుకేంద్రాల పరిశీలన

Advertisement
 
Advertisement
 
Advertisement