‘హమారీ పావ్‌రీ’ నయా ట్రెండ్‌ వైరల్‌ | Viral Pawrihorihai Memes: Zomato, Swiggy, And Netflix Joins In Online Memes Trend | Sakshi
Sakshi News home page

‘హమారీ పావ్‌రీ’ నయా ట్రెండ్‌ వైరల్‌

Feb 17 2021 11:30 AM | Updated on Feb 17 2021 3:02 PM

Viral Pawrihorihai Memes: Zomato, Swiggy, And Netflix Joins In Online Memes Trend - Sakshi

న్యూఢిల్లీ: యశ్‌రాజ్‌ ముఖాటే ప్రముఖ సంగీత నిర్మాత.. ఎప్పటికప్పుడు సరదా క్లిప్పింగ్స్‌, మీమ్స్, మాషప్‌లు  విడుదల చేసి సోషల్‌ మీడియాలో తెగ సందడి చేసేస్తుంటారు. ఇప్పుడు ఆయన మరొక సరదా మాషప్‌ను రీలీజ్‌ చేసి నెట్టింట్లో సందడి చేశాడు. ‘యే హమారి కార్‌ హై, యే హమ్‌ హై, అవుర్‌ యే .. హమారి పవ్‌రీ హో రహీహై’ (ఇది మా కారు, ఇది మేము, మా పార్టీ అవుతోంది) అంటూ ఆయన షేర్‌ చేసిన మాషప్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

ఇక పాకిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ డాననీర్‌ మోబీన్‌ ఈ మాషప్‌లో సరదాగా డ్యాన్స్‌ చేయడం ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆమె ‘పావ్‌రీ హోరహి హై ’అనే హష్‌ టాగ్‌ ఉన్న టీషర్ట్‌ ధరించి డాన్స్‌ చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ‘పావ్‌ రీ హో రహీ హై’ హష్‌ట్యాగ్‌ కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 7,300 మందికి పైగా దీన్నిలైక్‌ చేశారు. కొంత మంది నెటిజన్లు ఈ వీడియో చేసినందుకు మీకు థ్యాంక్స్‌అని, మరికొందరు మీ ఫుల్‌ ఎనర్జీ సీక్రెట్‌ ఏంటని కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎప్పటికీ ఇలానే ఫుల్‌ జోష్‌గా ఉండాలని కోరుకుంటున్నామని మరికొందరు కామెంట్లు పెట్టారు.

యశ్‌రాజ్‌ ముఖటే, గతంలోను ‘రాసోడ్‌ మేకోన్‌ థా’, గోపి బహు అండ్‌ రాశి, రాప్‌ సాంగ్‌, సాత్‌ నిభాయా  సాథియాస్‌ కికిలా బెస్‌ మాషప్‌లు ట్రెండ్‌ అయ్యాయి. ‘పావ్‌ రీ హో రహీ హై’ హ్యాష్‌ టాగ్‌తో జోమాటో, స్విగ్గి, మెక్‌ డొనాల్డ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలు కూడా తమదైన శైలిలో పోస్టులు షేర్‌ చేస్తున్నాయి.
చదవండి: శుభవార్త చెప్పిన మేఘన్‌ మార్కెల్‌ 

Advertisement
 
Advertisement
Advertisement