Girl Ends Life By Writing '2 Days Late, Sorry Dear' - Sakshi
Sakshi News home page

‘రెండు రోజులు లేటయ్యింది.. సారీ ప్రియా..’ అంటూ నవవివాహిత ఆత్మహత్య

Jul 8 2023 9:20 AM | Updated on Jul 8 2023 10:21 AM

girl commits suicide by writing 2 days late sorry dear - Sakshi

రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో తన ప్రియురాలికి పెళ్లి కావడంతో కలత చెందిన ‍ప్రియుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ప్రియుని ఆత్మహత్య విషయం తెలుసుకున్న నవవివాహిత తనకు పెళ్లి అయిన మూడవ రోజున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ప్రియురాలు ఆత్మహత్య చేసుకునేముందు సోషల్‌ మీడియాలో తన ప్రియుని ఫొటోతో పాటు ‘మనం జీవించినా, మరణించినా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం.. మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?’ అని రాస్తూ.. ‘ఈ బాధిత ప్రపంచంలో నన్ను ఎందుకు వంటరిగా వదిలేశావు? మరే పర్వాలేదు.. ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నా ప్రాణానివే. రెండు రోజులు లేటయ్యింది. సారీ ప్రియా’ అని రాసింది. ఈ విషాదకర ఉదంతం ఘోరీమన్నా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షోభాలా జైత్‌మాలాలో చోటుచేసుకుంది.

జూలై 4న వివాహం
మీడియాకు అందిన సమాచారం ప్రకారం షోభాలా జైత్‌మాలాకు చెందిన అనిత(22), పుర్ఖారామ్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ కాంపిటీటివ్‌ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు జూలై 4న వివాహం జరిగింది. దీంతో తీవ్రంగా కలతచెందిన పుర్ఖారామ్‌ జూలై 4న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 5న ఆ ప్రియురాలికి తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసింది. 

బావిలో తేలిన నవవివాహిత మృతదేహం
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్లయిన అనిత తన ఇంటి నుంచి పాలు తీసుకువచ్చేందుకు పశువులశాలకు వెళ్లింది. ఎంతసేపయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెదుకులాట సాగించారు. వారికి ఒక బావి దగ్గర ఒక పాల పాత్ర కనిపించింది. దీంతో వారు అనుమానంతో బావిలోకి తొంగి చూశారు. బావిలో వారికి అనిత మృతదేహం తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అది పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమికుల ఆత్మహత్య గ్రామంలోని వారందరినీ శోకసంద్రంలో ముంచింది. 
ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement