కమలాహారిస్‌తో డిబేట్‌కు రెడీ: ట్రంప్‌ | Donald Trump Agrees To Debate Kamala Harris On September 10 | Sakshi
Sakshi News home page

కమలాహారిస్‌తో డిబేట్‌కు రెడీ: ట్రంప్‌

Aug 9 2024 7:26 AM | Updated on Aug 9 2024 9:40 AM

Donald Trump Agrees To Debate Kamala Harris On September 10

ఫ్లోరిడా: డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌కు సిద్ధమని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న ఏబీసీ టీవీచానల్‌లో చర్చకు రెడీ అని తెలిపారు. ఫ్లోరిడాలోని తన పామ్‌బీచ్‌ ఎస్టేట్‌లో ట్రంప్‌ గురువారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ముందు చర్చలు జరగడం చాలా ముఖ్యమని ట్రంప్‌ పేర్కొన్నారు. 

డెమొక్రటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి టిమ్‌ వాల్జ్‌ రాడికల్‌ లెఫ్ట్‌ భావాలున్న వ్యక్తని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  అయితే ట్రంప్‌ డిబేట్‌ ప్రతిపాదనపై కమలాహారిస్‌ క్యాంపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.  తాను ఏబీసీ చానాల్‌లో చర్చకు రానని సోషల్‌ మీడియాలో ప్రకటించిన కొద్ది రోజులకే  మాట మార్చి అందులోనే చర్చకు వస్తానని ట్రంప్‌ చెప్పడం గమనార్హం. నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement