కోవిడ్‌తో తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ ఫారిన్‌ సెక్రటరీ కన్నుమూత | Colin Powell: Former US secretary of state dies of Covid complications | Sakshi
Sakshi News home page

Colin Powell: కరోనాతో మాజీ విదేశాంగ మంత్రి పావెల్‌ కన్నుమూత

Oct 18 2021 6:32 PM | Updated on Oct 18 2021 8:15 PM

Colin Powell: Former US secretary of state dies of Covid complications - Sakshi

అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్ లూథర్ పావెల్  (84) కన్నుమూశారు.  కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు పావెల్‌ కుటుంబం సోమవారం ప్రకటించింది. 

వాషింగ్టన్‌:  అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్ లూథర్ పావెల్  (84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు  పావెల్‌ కుటుంబం సోమవారం ప్రకటించింది.  అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్‌ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. పావెల్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని కూడా వెల్లడించింది. ఈ సందర్బంగా ఆయనకు చికిత్సఅందించిన వైద్య సిబ్బందికి ఫేస్‌బుక్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.  

కాగా రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన పావెల్‌  టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2000లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో తొలి ఆఫ్రికన్-అమెరికన్ విదేశాంగ కార్యదర్శిగా ఘనతను సాధించారు.  బుష్‌ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2001-2005 వరకు బుష్ క్యాబినెట్‌లో పనిచేసిన పావెల్‌ సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో కీలక భూమికను నిర్వహించారు. అయితే ఇరాక్‌ యుద్ధం సందర్భంగా  పావెల్‌ తీవ్ర విమర్శలపాలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement