సిద్ధాంతం కోసం పనిచేసేదే బీజేపీ | Sakshi
Sakshi News home page

సిద్ధాంతం కోసం పనిచేసేదే బీజేపీ

Published Sun, May 26 2024 7:15 AM

సిద్ధాంతం కోసం పనిచేసేదే బీజేపీ

హన్మకొండ: కమిట్‌మెంట్‌తో, సిద్ధాంతం కోసం పని చేసేది కేవలం బీజేపీ నాయకులే అని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి పూర్తి సహకారం లభించకపోవడంతో కేటీఆర్‌.. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్‌ చేసి మద్దతివ్వాలని కోరుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రాణభయం ఉందని, జైలులో నుంచి బీజేపీ లీగల్‌ సెల్‌ నాయకులకు ఫోన్లు చేసి సహాయం పొంది బీజేపీలో చేరిన తీన్మార్‌ మల్లన్న ఆతర్వాత బీజేపీని, ప్రధానిని, నాయకులను తిట్టిన నీచుడు అని దుయ్యబట్టారు. విశ్వసనీయ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, పట్టభద్రులు తనను గెలిపించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ప్రజలు, పట్టభద్రుల సమస్యలపై పోరాడే గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్‌, వరంగల్‌ పార్లమెంట్‌ ప్రభారీ మురళీధర్‌ గౌడ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ తదితరులున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement