Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Published Fri, Nov 17 2023 1:16 AM

-

హన్మకొండ: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కృషి చేస్తోందని అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ మాతంగి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ కార్యాలయ స్పోర్ట్స్‌ హాల్‌లో అసోసియేషన్‌ సమావేశం జరిగింది. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 సర్కిళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ అసోసియేషన్‌కు సభ్యుల బాగోగులే ప్రధానమన్నారు. అసోసియేషన్‌ బలోపేతానికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అలాగే సంస్థ మనుగడకూ తమ వంతు కృషి చేయాలన్నారు. అసోసియేషన్‌ టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ శాఖ కార్యదర్శి బక్క దానయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజు, ఎన్పీడీసీఎల్‌ శాఖ అధ్యక్షుడు ఆరేపల్లి శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.ఉపేందర్‌, ఉపాధ్యక్షులు రామస్వామి, రౌతు రమేష్‌ కుమార్‌(పాల్గొన్నారు.

కేడీసీకి అటానమస్‌ హోదాపై హర్షం

విద్యారణ్యపురి: ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ కళాశాలగా పేరొందిన, న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ కలిగిన హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల.. యూజీసీ నుంచి అటానమస్‌ హోదా పొందడంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజారెడ్డిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రమేష్‌ను జీసీజీటీఏ బాధ్యులు, ప్రభుత్వ పింగిళి కళాశాల, కేడీసీ యూనిట్ల బాధ్యులు గురువారం సన్మానించారు. అలాగే ఐక్యూఏసీ బృందం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో జీసీజీటీఏ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వెంకన్న, శిరీష, అ శోక్‌, ఇందిరా, నైనాదేవి, పార్వతి, స్నేహలతరెడ్డి, సుహాసిని, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement