ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, స్టైలిష్ చీరలో శోభితా స్టన్నింగ్‌ లుక్‌ : ‘చే’ రియాక్షన్‌ | Sobhita Dhulipala Stuns In A Stylish Saree and Engagement Ring Naga Chaitanya | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, స్టైలిష్ చీరలో శోభితా స్టన్నింగ్‌ లుక్‌ , ‘చే’ రియాక్షన్‌

Sep 5 2024 10:50 AM | Updated on Sep 5 2024 11:44 AM

Sobhita Dhulipala Stuns In A Stylish Saree and Engagement Ring Naga Chaitanya

ప్రముఖ నటి, మోడల్‌ శోభిత దూళిపాళ్ల  అందం, స్టయిలిష్‌ మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. త్వరలో తన డ్రీమ్‌ బోయ్‌ నాగ  చైతన్యను  పెళ్లాడబోతున్న శోభిత తన   తాజా ఫోటోషూట్‌కు సంబంధించిన అందమైన  ఫోటోలను పోస్ట్‌ చేసింది.  నారింజ, నలుపు రంగుల మిశ్రమంల ఉన్న ప్రింటెడ్‌ చీరను ధరించింది. హెయిర్‌ స్టయిల్‌ కూడా స్పెషల్‌గా నిలిచింది. ముఖ్యంగా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

ఈ ఫోటోలను చూసిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా విస్మయం చెందడం విశేషం. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సానుకూల మెసేజ్‌లతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసించారు. తమ అభిమాన హీరో నాగ చైతన్యకి పర్‌ఫెక్ట్‌ సెట్‌ అవుతారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.  ఈ పోస్ట్‌కు శోభిత కాబోయే భర్త  నాగ చైతన్య లైక్‌ కొట్టాడు.

ఇన్ స్టాలో  గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.  ఆగస్ట్ 27న  నిశ్చితార్థం  పూర్తి చేసుకున్న శోభిత, చైతన్య జంట వచ్చే ఏడాది మార్చిలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారని తెలుస్తోంది.  కాగా పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారా,  లేక సింపుల్‌ గానా? అని  ఇటీవల ప్ర‌శ్నించినపుడు, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం, సింపుల్‌గా పెళ్లి చేసుకోవడమే తనకిష్టమని   చైతూ  క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement