Beauty Tips: ముఖం మీద.. పేరుకుపోయే మురికిని.. తొలగించడిలా..! | Remove The Dirt That Accumulates On The Face | Sakshi
Sakshi News home page

Beauty Tips: ముఖం మీద.. పేరుకుపోయే మురికిని.. తొలగించడిలా..!

Jun 23 2024 3:59 AM | Updated on Jun 23 2024 3:59 AM

Remove The Dirt That Accumulates On The Face

ముఖం మీది మేకప్‌ను  అయినా.. పొల్యుషన్‌తో పేరుకుపోయే మురికినైనా తొలగించడం కాస్త కష్టమే! అందుకే ఈ మసాజర్‌ అండ్‌ క్లీనర్‌ వచ్చింది మార్కెట్‌లోకి. మేకప్‌తో పాటు కాలుష్యపు జిడ్డునూ డీప్‌గా క్లీన్‌ చేసి.. మృతకణాలనూ తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుందీ డివైస్‌.

దీని సిలికాన్‌ బ్రష్‌ హెడ్‌.. సాధారణ బ్రష్‌ కంటే 35 రెట్లు అధికంగా చర్మాన్ని శుభ్రపరస్తూ స్కిన్‌ ఫ్రెండ్లీగానూ  ఉంటోంది.  క్లీనింగ్‌ అండ్‌ మసాజింగ్‌ ఆప్షన్స్‌తో పని చేసే ఈ 2 ఇ¯Œ  1 గాడ్జెట్‌.. సోనిక్‌ వైబ్రేషన్స్‌తో,  6ఎక్స్‌ డీపర్‌ క్లీన్‌ అనే హై టెక్నాలజీ హీటెడ్‌ హెడ్‌తో వేగంగా పనిచేస్తుంది.

ఒక్కసారి చార్జింగ్‌ పెట్టుకుంటే.. దీన్ని 20 నుంచి 30 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5 స్కి¯Œ కేర్‌ మోడ్స్‌ ఉంటాయి. వాటిలో మూడు వైబ్రేష¯Œ  స్పీడ్‌ మోడ్స్‌ కాగా.. రెండు హీటెడ్‌ మసాజ్‌ మోడ్స్‌లో పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి హెడ్స్‌ మార్చుకుంటే సరిపోతుంది. ఈ డివైస్‌ని స్త్రీ, పురుషులు ఇరువురూ వినియోగించుకోవచ్చు. ఈ పరికరాన్ని నీటితో క్లీ¯Œ  చెయ్యకూడదు. చార్జింగ్‌ పెట్టేప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలి. దీని ధర సుమారు 65 డాలర్లు. అంటే 5,446 రూపాయలు.

ఇవి చదవండి: నిజమే..! ఇది మంత్రదండంలాంటి 'ఏఐ' ఉంగరమే..!!

Advertisement
 
Advertisement
Advertisement