కిడ్‌ఫ్లూయెన్సర్‌... కిం కర్తవ్యం | Kidfluencers have made both kids and parents believe they too can go viral | Sakshi
Sakshi News home page

కిడ్‌ఫ్లూయెన్సర్‌... కిం కర్తవ్యం

Apr 27 2025 6:15 AM | Updated on Apr 27 2025 6:55 AM

Kidfluencers have made both kids and parents believe they too can go viral

గుడ్‌ అండ్‌ బ్యాడ్‌

యూ ట్యూబ్‌లో కిడ్‌ఫ్లూయెన్సర్‌ల వైరల్‌ వీడియోలు ప్రవాహంలా కనిపిస్తాయి. క్యాచీ కంటెంట్‌తో లక్షల్లో వ్యూస్‌ సాధిస్తున్నారు. లక్షల్లో సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. మన దేశంలో క్లిడ్‌ఫ్లూయెన్సర్‌ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెర వెనుక కథ గురించి చర్చ మొదలైంది. షూటింగ్‌ల కోసం వారు తరచుగా స్కూల్‌కు వెళ్లకుండా ఎక్కువ సెలవులు పెడుతున్నారా? సరిగా తింటున్నారా? తగినంత నిద్ర ఉంటోందా? కంటెంట్‌కు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారా? అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని ఎంజాయ్‌ చేయలేకపోతున్నారా... ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి.

బాగా చదివే పిల్లలు కూడా ‘కిడ్‌ఫ్లూయెన్సర్‌’ ట్యాగ్‌లైన్‌ పుణ్యమా అని చదువులో వెనకబడి పోతున్నారు. ‘నేను చాలా సాధించాను. నేను చాలా గ్రేట్‌’ అనే భావన పెరిగిపోతుంది. ‘యాభై ఏళ్ల క్రితం అకాడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ గోల్డ్‌ స్టాండర్డ్, ముప్పై ఏళ్ల క్రితం ఆటలు ఉండేవి. ఇప్పుడు క్రియేటివిటీ, డ్యాన్స్, మ్యూజిక్, విజువల్‌ కంటెంట్‌. ఒక్క వైరల్‌ వీడియో చాలు పిల్లలకు రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ తీసుకురావడానికి. ఈ తక్షణ పాపులారిటీ వల్లే పిల్లలు, తల్లిదండ్రులు వైరల్‌ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు’ అంటుంది కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ డా.మేఘా పుష్కర్ణ.

Advertisement
 
Advertisement
Advertisement