ఆ మాస్టార్‌ అంకితభావానికి మాటల్లేవ్‌ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా.. | Kerala Teacher Has Swam Every Day to School for 20 Years | Sakshi
Sakshi News home page

Kerala Teacher: ఆ మాస్టార్‌ అంకితభావానికి మాటల్లేవ్‌ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..

Jun 2 2025 1:16 PM | Updated on Jun 2 2025 1:56 PM

Kerala Teacher Has Swam Every Day to School for 20 Years

గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టారు. పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం..ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే కంగుతింటారు. అలా ఏకంగా 20 ఏళ్ల నుంచి చాలా శ్రమ ఓర్చి.. తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పైగా ఆయన డ్యూటీ పరంగా చాలా సిన్సియర్‌, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖాలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టార్‌ని పొందిన ఆ విద్యార్థులు కూడా ఎంతో అదృష్టవంతులు కదూ..!.

ఆ మాస్టార్‌ పేరు అబ్దుల్‌ మాలిక్‌. కేరళకు చెందని ఆయన మల్లాపురంలోని పదింజత్మురిలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్‌లో లెక్కల మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఆ స్కూల్‌ని చేరాలంటే.. ప్రతిరోజూ సాహసం చేయాల్సిందే. నడుంకి ఓ ట్యూబ్‌ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తుంటారు. 

ఇలా ట్యూబ్‌ తగిలించుకోవడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ముద్దుగా ‘ట్యూబ్ మాస్టర్’ అనిపిలుస్తుంటారు. అయితే ఇలా నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడూ.. కాలానుగుణంగా వచ్చే భారీ వర్షాలు, పాములు వంటి ఇతర భయంకరమైన సరీసృపాలు తదితర సవాళ్లు చాలానే ఎదుర్కొంటుంటారాయన. అయినా అవేమి ఆయన్ను తన విద్యార్థుల దగ్గరకు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి. ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోకపోవడం విశేషం. 

ఇలానే ఎందుకంటే..
మాలిక్‌కి ఇలా నదిలో ఈదుకుంటూ కాకుండా మరొక మార్గం ఉంది. కానీ మరింత వ్యయప్రయాసలతో కూడినది. ఎందుకుంటే సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ స్కూల్‌కి చేరుకోవాలంటే మూడు బస్సులు మారాల్సిందే. పైగా మూడుగంటలకు పైగా జర్నీ చేయాలి. దాంతో మాలిక్‌​ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్‌కి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పడవల సాయంతో వెళ్దామంటే..  ఆ నది నీటి ఉద్ధృతిలోని హెచ్చు తగ్గుల రీత్యా అది అస్సలు సాధ్యం కానీ పని అంటున్నారు మాలిక్‌. 

ఇక ఆయన క్లాస్‌లు ఉదయం 10.30తో మొదలవ్వుతాయి. ఆయన గణితాన్ని బోధించడం తోపాటు పర్యావరణం గురించి తెలుసుకునేలా ఆయన రోజు ఈతకొట్టి వచ్చే నది వద్దకు కూడా విద్యార్థులను తీసుకువెళ్తారు మాలిక్‌. ప్రకృతిని కాపాడుకోవడం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా తీసుకువెళ్తుంటానని చెబుతున్నారు మాలిక్‌. 

కాగా, 2013 నుంచి ఆ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు మాలిక్‌. అలా ఈ ఏడాది 2025 పూర్తి అయ్యే నాటికి.. ఆయన ఆ స్కూల్‌కి వెళ్లి తిరిగి రావడానికి.. దాదాపు 700 కిలోమీటర్లక పైనే ఈత కొట్టినట్లు అంచనా.!. నిజంగా ఈ మాస్టారు మాములు గ్రేట్‌ కాదు కదా..!.

 

(చదవండి: పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..! ఆ ఎవర్‌గ్రీన్‌ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..)

 

Advertisement
 
Advertisement
Advertisement