మినీ ‍డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..! | Janhvi Kapoor Steps Out In White Mini Dress, Fans Compare It To Dosa, Video Goes Viral | Sakshi
Sakshi News home page

మినీ ‍డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!

Aug 2 2024 4:18 PM | Updated on Aug 2 2024 5:36 PM

Janhvi Kapoor Steps Out In White Mini Dress

బాలీవుడ్‌ జాన్వీ కపూర్‌ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్‌ డిజైనర్‌ వేర్‌ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్‌ మూవీ ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్‌. అందులో లీడ్‌రోల్‌లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించింది. 

ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్‌ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్‌ ఈవెంట్‌కి ప్రముఖ బాలీవుడ్‌ నటి రేఖ, అర్జున్‌ కపూర్‌, ఖుషీ కపూర్‌, జాన్వీ ప్రియుడు శిఖర్‌ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్‌వే మినీ దుస్తులతో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించింది. ఈ డ్రెస్‌ని  డీప్‌ ఆఫ్-ది-షోల్డర్ నెక్‌లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. 

అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్‌ లుక్‌తో మిస్మరైజ్‌ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్‌ అయినా ఆమె దీన్ని కవర్‌ చేసేలా లోపల చక్కటి స్కిన్‌ వేర్‌ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్‌ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్‌ టేబుల్స్‌పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్‌లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్‌! ఏకంగా 546 వజ్రాలతో..!)

 

Advertisement
 
Advertisement
Advertisement