అందుబాటులోకి ఆట.! ఇండోర్‌ షటిల్‌ కోర్టు రెడీ! | Indoor shuttle court ready in Jeedimetla Hyderabad | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ఆట.! ఇండోర్‌ షటిల్‌ కోర్టు రెడీ!

May 3 2025 5:20 PM | Updated on May 3 2025 5:29 PM

Indoor shuttle court ready in Jeedimetla Hyderabad

జీడిమెట్ల: సుభాష్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌.ఆర్‌.నాయక్‌నగర్‌లో ఇండోర్‌ షటిల్‌ కోర్టును జీహెచ్‌ఎంసీ నిర్మించడంపై ఎస్‌.ఆర్‌.నాయక్‌నగర్, అపురూపాకాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో షటిల్‌ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి షటిల్‌ ఆడుకుంటున్నారు. గతంలో కాలనీవాసులు షటిల్‌ ఆడాలంటే బాచుపల్లి, చింతల్, సుచిత్ర వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కాలనీలో సదుపాయం కలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు మంచినీటితో పాటు టాయిలెట్స్‌ సదుపాయం కలుగజేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు. 

కాలనీ స్థలంలో రూ.3 కోట్లతో నిర్మాణం  
నవంబర్‌ 2022లో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్‌ హేమలతా సురే‹Ùరెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ సూరిబాబు కాలనీ అసోషియేషన్, కాలనీ ప్రజల ప్రోత్సాహంతో 23 నెలల్లో ఇండోర్‌ కోర్టు పనులను పూర్తి చేశారు.  

ఎకరం స్థలంలో ఇండోర్‌ స్టేడియం  
ఇండోర్‌ కోర్టు లోపల ఒకేసారి 12మంది క్రీడాకారలు ఆడుకునేల మ్యాటింగ్‌తో మూడు సింథటిక్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం కోర్టు లోపల ఎల్‌ఈడీ లైటింగ్‌లో పాటు టేబుల్‌ ఫ్యాన్‌లను అమర్చారు. కోర్టుల చుట్టూ క్రీడాకారులు కురీ్చల్లో కూర్చునేలా కొంత మేరకు స్థలాన్ని వదిలారు. 7వేల చదరపు ఆడుగుల్లో మూడు సింథటిక్‌ షటిల్‌ కోర్టులు నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్స్, క్రీడాకారులు ప్రతి నెల కొంత చెల్లించేలా జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి ఒక సిస్టం తీసుకువస్తామని కాంట్రాక్టర్‌ అన్నారు. 

టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధం 
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి కేటాయించిన షటిల్‌ ఇండోర్‌ కోర్టు మా కాలనీలో నిర్మించడం అనందంగా ఉంది. మా కాలనీ, అపురూపాకాలనీలో షటిల్‌ ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. యువ క్రీడాకారులు ఇక్కడ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది మా అకాంక్ష. మా ఇరు కాలనీల తరపున మేము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.     – టీటీకే శ్రీనివాస్‌ (ఎస్‌ఆర్‌.నాయక్‌నగర్‌ అధ్యక్షుడు)  

సంతోషంగా ఉంది  
ఫిట్‌గా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మనం పట్టు సాధించాలి. అలా అని రోడ్లపైన ఆడలేం. మాకు దగ్గరలో మా కాలనీలో ఇండోర్‌ షటిల్‌ కోర్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ షటిల్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం. -సుస్మిత, అపురూపాకాలనీ  

మేము ఊహించలేదు  
మాకు షటిల్‌ ఆటపై మక్కువతో ఇంతకు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆడేవాళ్లం. ఇప్పుడు మా ఇళ్ల మధ్యలోనే షటిల్‌కోర్టును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించలేనిది.  – రాఘవయ్య, కాలనీవాసి

జీహెచ్‌ఎంసీకి కృతజ్ఞతలు  
నాకు షటిల్‌ ఆడాలనే కోరిక ఉండేది కాని మాకు దగ్గలో ఎక్కడ ఇండోర్‌ స్టేడియం లేదు. మా కాలనీలో ఇండోర్‌ కోర్టు ఏర్పాటు కావడం మాకు వరం. మూడ్రోజులుగా ఇక్కడకు వచ్చి షటిల్‌ ఆడుతున్నాం. మా కాలనీలో షటిల్‌ కోర్టు నిర్మించిన జీహెచ్‌ఎంసీ వారికి కృతజ్ఞతలు.    – దివ్య, అపురూపాకాలనీ 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement