కళలు పండిద్దాం... | Hyderabad Art Week to make gallery hopping the city latest trend | Sakshi
Sakshi News home page

కళలు పండిద్దాం...

Oct 25 2026 4:35 AM | Updated on Oct 25 2026 4:35 AM

Hyderabad Art Week to make gallery hopping the city latest trend

కళావారోత్సవం

సాధారణంగా ఆర్ట్‌ గ్యాలరీని సందర్శించడం అంటే అదొక నిశ్చలమైన... నిశ్శబ్దమైన బోరింగ్‌ ప్రోగ్రామ్‌ అనిపిస్తుంది తప్ప విందు వినోదాల సవ్వడి అనిపించదు. దాంతో జోష్‌ను ఇష్టపడే సిటీజనులు గ్యాలరీలను సందర్శించడానికి అంతగా ఇష్టపడరు. ఈ తరహా అభి్రపాయాన్ని మార్చడానికి గ్యాలరీలు కూడా సరదా సందడిని సృష్టిస్తాయని తెలియజేయడానికి హైదరాబాద్‌ నగరంలో తొలిసారి ఆర్ట్‌ వీక్‌ను నిర్వహిస్తున్నారు. ఫ్యాషన్  వీక్‌ తరహాలో ఈ సోమవారం నుంచి జరగనున్న ఈ కళాపండుగ నిర్వహణ కోసం నలుగురు మహిళలు చేతులు కలపడం విశేషం.

నగర సోషలైట్స్‌గా, పేజ్‌ త్రీ ప్రముఖులుగా పేరొంది, ప్రముఖ గ్యాలరీలు కళాకృతి, సృష్టి, కడారి, థీ కాంటెంపరరీల గ్యాలరీల వ్యవస్థాపకు లుగా ఉన్న రేఖా లహోటి, భార్గవి గుండాల, లక్ష్మీ నంబియార్, సుప్రజరావుల ఆధ్వర్యంలో ఆర్ట్‌ గ్యాలరీని నిర్వహిస్తున్నారు. ఆర్ట్‌ విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డిజైనర్లు వారం రోజుల కార్యక్రమంతో మమేకం కానున్నారు. పలు కేఫ్స్‌ కూడా దీనిలో పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా కడారి గ్యాలరీ వ్యవస్థాపకురాలు, ఆర్కిటెక్ట్‌ సుప్రజరావు మాట్లాడుతూ ‘‘విహారయాత్ర అంటే సమీపంలోని పిక్నిక్‌ స్పాట్‌కే పరిమితం కానక్కర్లేదు. ఒక గ్యాలరీ సందర్శన కూడా కావచ్చు. ఈ కార్యక్రమం ద్వారా కళాభిమానులతోపాటు,  గ్యాలరీల సందర్శనపై ఆసక్తి చూపని వారిని కూడా ఆకర్షించాలనేది మా లక్ష్యం’’ అని తెలిపారు.

ఆద్యంతం...కళాత్మకం...
ఈ కార్యక్రమంలో గ్యాలరీల, వారసత్వ ప్రదేశాల సందర్శన, వర్క్‌షాప్‌లు, కళాకారులతో సంభాషణలు, కళాప్రదర్శనలు,  ప్యానెల్‌ చర్చలు వంటివి ఉంటాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, ఫైన్  ఆర్ట్స్‌ విభాగం విద్యార్థులు గీసిన చిత్రాల ప్రదర్శన, గైడెడ్‌ వాక్స్‌ కూడా నిర్వహిస్తారు. తమ పోర్ట్‌ఫోలియోలను,  కెరీర్‌లను ఎలా నిర్మించుకోవాలనే దానిపై ఆర్ట్‌ స్టూడెంట్స్‌కు మార్గదర్శక ప్రసంగాలు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.

– సత్యబాబు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement