కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో తెలుసా? | Dog Bite Precautions Special Story In Telugu | Sakshi
Sakshi News home page

కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో తెలుసా?

Mar 11 2021 7:41 PM | Updated on Mar 11 2021 7:47 PM

Dog Bite Precautions Special Story In Telugu - Sakshi

చిన్న పిల్లల మీద కుక్కల దాడులు అధికమతున్నాయి. వాటి దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి జగ్రత్తలు తెలుసుకోండి. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే.. గాయం తీవ్రతను తగ్గించవచ్చు.
►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం కింద  కడగాలి. అంటే... మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్‌తో వీలైనంత శుభ్రంగా కడగాలి.
► కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్‌గా ఉంచాలి.
►కుక్క కాటు తర్వాత రేబీస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్‌ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి.
► గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది.
► గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement