అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా! మారండిరా బాబూ!! | Dangerous Motor bike stunt TSRTC Md VCsajjanar reaction | Sakshi
Sakshi News home page

అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా! మారండిరా బాబూ!!

Jun 24 2025 11:48 AM | Updated on Jun 24 2025 3:31 PM

Dangerous Motor bike stunt TSRTC Md VCsajjanar reaction

ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే  ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా  వీరి ప్రవర్తనలో  ఏ మాత్రం మార్పు రావడం లేదు.  తాజాగా ఒక  వీడియో నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు.  

మరోవైపు  అనేక  సామాజిక అంశాలపై సోషల్‌మీడియాలో స్పందించే టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Vishwanath Channappa Sajjanar) కూడా  ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. 

సజ్జనార్‌ ట్వీట్‌లో ఎమన్నారంటే..
అది బైకా.. లేక ఇంకేమ‌న్నానా!!
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది..  ప్ర‌మాద‌మ‌ని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్ల‌ని ఏం అనాలి. జ‌ర‌గ‌రానిది జ‌రిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంత‌టి క్షోభ‌ను అనుభ‌విస్తాయ‌నే క‌నీస సోయి కూడా వీళ్ల‌కు లేదు.

సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు కొంద‌రు టీనేజ‌ర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్ల‌కే తెలియాలి!!


అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్‌మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి?  మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని   మరికొందరు సూచిస్తున్నారు.

 చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్‌
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement