దీపావళి శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

దీపావళి శుభాకాంక్షలు

Published Sun, Nov 12 2023 1:52 AM

ఆళ్ల నాని, 
ఏలూరు ఎమ్మెల్యే   - Sakshi

ఏలూరు టౌన్‌: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే పండుగ దీపావళి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఆకాంక్షించారు. దీపావళిని ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలు, అధికార యంత్రాంగం, వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

పర్యావరణహితంగా..

ఏలూరు(మెట్రో): దీపావళిని జిల్లా ప్ర జలు పర్యావరణ హితంగా, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఓటింగ్‌ యంత్రాల తనిఖీ పూర్తి

ఏలూరు(మెట్రో): జిల్లాలో మొదటి దశ ఓటింగ్‌ యంత్రాల తనిఖీ పూర్తి చేసినట్టు కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. జిల్లాలో అక్టోబర్‌ 16న మొదలైన తనిఖీల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందన్నారు. బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌లను బెంగళూరుకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజనీర్లు తనిఖీ చేశారన్నారు. గుర్తింపు పొందిన రాజ కీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈనెల 10 వరకు మాక్‌పోల్‌ కూడా నిర్వహించామన్నారు. 5,545 బ్యాలెట్‌ యూనిట్లు తనిఖీ చేయగా 5,494, 4,421 కంట్రోల్‌ యూనిట్లను తనిఖీ చేయగా 4,406, 5,297 వీవీప్యాట్‌లు తనిఖీ చేయగా 5,254 పనిచేస్తున్నట్టు గుర్తించారన్నారు. తనిఖీల అనంతరం 51 బీయు, 15 సీ యు, 43 వీవీప్యాట్లు పనిచేయని యంత్రాలను తిరిగి బెంగళూరుకు పంపిస్తామన్నారు. తనిఖీల ప్రక్రియకు డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరా జు పర్యవేక్షకులుగా వ్యవహరించారన్నారు.

17న కులగణనపై సమావేశం

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాజమహేంద్రవరంలో ఈనెల 17న కులగణనకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, కార్పొరేషన్‌ చైర్మ న్లు, సభ్యులు తదితరులు పాల్గొంటారన్నారు.

Advertisement
Advertisement