Hyderabad: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం | Rave Party Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం

Jul 25 2024 6:28 PM | Updated on Jul 25 2024 6:48 PM

Rave Party Busted In Hyderabad

మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను  ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్వాకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement