Hyderabad Police Raid In House At Nacharam, 3 Members Arrested - Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు

Dec 14 2021 9:15 AM | Updated on Dec 14 2021 3:16 PM

Police Raids On Prostitution House In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మల్లాపూర్‌ (హైదరాబాద్‌): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్‌ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్‌ (44), మల్లికార్జున్‌ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు.   

చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్‌.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!

ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్‌
శంషాబాద్‌: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్‌–439 విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో  316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement