Hyderabad: Police Raid On Prostitution House At Chilkalguda - Sakshi
Sakshi News home page

Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా.. ఇద్దరు అరెస్టు

Nov 8 2021 11:56 AM | Updated on Nov 8 2021 7:50 PM

Police Raid On Prostitution House At Chilkalguda In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్‌): వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్‌ సోఫియా (50) నెల రోజుల క్రితం బౌద్ధనగర్‌లోని కమ్యూనిటీహాల్‌ గల్లీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్‌ ఏషియన్‌ వైన్స్‌లో పనిచేస్తున్న అప్పుల అనీల్‌ (26) సాయంతో అమ్మాయిలు, ఆంటీలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వ్యభిచార గృహంపై దాడి చేసి ఓయువతి (23)కి విముక్తి కల్పించి, నిర్వాహకులు రేచల్‌ సోఫియా, అనీల్‌తోపాటు అత్తాపూర్‌కు చెందిన విటుడు శ్రీశైలం (40)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు చెందిన మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని సీఐ నరేష్‌ తెలిపారు.   

చదవండి: అమ్మాయితో పరిచయం.. ప్రేమ.. పండుగకు ఇంటికి వచ్చి..

Advertisement
 
Advertisement
Advertisement