ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు

Molestated Girl Gives Birth In Hospital Bathroom In Kochi - Sakshi

ఆరు నెలల పిండాన్ని వదిలేసుకునేందుకు యత్నం

ఆస్పత్రిలో ప్రసవించి నీళ్లు పోసి పారేసిన బాలిక

కేరళలోని కొచ్చిలో ఘటన

తిరువనంతపురం: అత్యాచారానికి గురయిన బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల పిండాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా నెలలు నిండకుండానే ప్రసవించేందుకు ప్రయత్నించడంతో పిండం బయటకు వచ్చింది. ఆస్పత్రిలోని బాత్రూమ్‌లో పిండాన్ని నీళ్లు పోసి వదిలించుకునేందుకు ప్రయాస పడింది. ఈ హృదయ విదారక సంఘటన కేరళలో జరిగింది. 18 ఏళ్లు నిండని బాలిక అత్యాచార బాధితురాలు. గర్భిణి కావడంతో వైద్య పరీక్షల కోసం తల్లితో కలిసి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బుధవారం వెళ్లింది. వైద్యురాలి కోసం వేచి చూస్తున్న సమయంలో ఆ యువతి బాత్రూమ్‌కు వెళ్లింది.
చదవండి: సీక్రెట్‌ యాప్‌తో భార్య ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆమెపై నీడలా భర్త

ఈ సమయంలో నెలలు నిండకుండానే బలవంతంగా ప్రసవించేందుకు ప్రయత్నించింది. తీవ్ర ప్రయత్నం చేయడంతో ఆరు నెలల పిండాన్ని ప్రసవించింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాత్రూమ్‌లో ఎక్కువగా నీళ్లు పోసి కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. అయితే పిండం ఆ నీటికి మరుగుదొడ్డిలోకి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రి నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలికను 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: ‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top