కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడి..

Kottagudem: Uncle Molested Daughter In laws - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాజాగా జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కవల బాలికలకు అండగా ఉంటానని మేనమామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. అయితే చిన్నారులను చేరదీసిన మేనమామ కామాంధుడిగా మారి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచి ఈ ఘోరం జరుగుతుండటంతో ఏం చేయాలో తోచక బాధను దిగమింగుకొని భరిస్తూ వచ్చారు. 

ప్రస్తుతం ఈ ఇద్దరు అక్కాచెల్లెలు.. కొత్తగూడెం పట్టణంలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల మేనమామ వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరిగారు. దీంతో తనపై ఎదురుతిరిగిన కవలలపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
చదవండి: జంట హత్యల కలకలం: చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top