TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో.. | Fake Protocol Officer Arrested In Telangana CMO - Sakshi
Sakshi News home page

TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో..

Dec 9 2023 6:57 PM | Updated on Dec 9 2023 7:15 PM

Fake Protocol Officer Arrested In Telangana Cmo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాండ్ సెటిల్‌మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్‌లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు.

వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను సీజ్‌ చేశారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు 

Advertisement
 
Advertisement
Advertisement