● తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ● ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు ● నిబంధనలు జారీ చేసిన ఎన్నికల సంఘం | Sakshi
Sakshi News home page

● తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ● ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు ● నిబంధనలు జారీ చేసిన ఎన్నికల సంఘం

Published Sun, May 26 2024 10:05 AM

● తొమ

చిత్తూరు కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇక తొమ్మిది రోజులే సమయం ఉండడంతో జిల్లా యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఎన్నికల డీటీలు, కౌంటింగ్‌ సిబ్బంది విధులకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. ముఖ్యంగా స్ట్రాంగ్‌ రూమ్‌ లేఅవుట్‌పై ఇన్‌చార్జ్‌ అధికారి అవగాహన కలిగి ఉండాలి. నోడల్‌ అధికారులు వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి. సందేహాలు వచ్చినప్పుడు ఆర్‌ఓలతో మాట్లాడాలి. పోస్టల్‌ బ్యాలెట్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ నోడల్‌ అధికారులు, సీలింగ్‌ అధికారులు, రో–ఇన్‌చార్జ్‌లు అనుసరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా సూచించింది. పోస్టల్‌ బ్యాలెట్‌, ఈటీపీబీఎస్‌ ఓట్లు ఎలా లెక్కించాలి ? వ్యాలిడ్‌, ఇన్‌వ్యాలిడ్‌ ఓట్లను ఎలా గుర్తించాలి ? అనేదానిపై సిబ్బందికి ఈ నెల 28న మొదటి విడత శిక్షణ ఇచ్చేందుకు కలెక్టరేట్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

చెక్‌లిస్టును అనుసరిస్తూ..

జూన్‌ 3వ తేదీ సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి.

రౌండ్ల వారీగా ఫలితాల నమోదు, వాటిని ప్రకటించే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అంకెల్లో పొరపాటు జరగకూడదు.

రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి. అలాగే సహాయ ఆర్‌ఓ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

● తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ● ఎస్వ
1/1

● తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ● ఎస్వ

Advertisement
 
Advertisement
 
Advertisement