Sakshi News home page

సైకిల్‌ మెకానిక్‌ కుమార్తెకు అరుదైన గౌరవం

Published Tue, Nov 14 2023 9:58 AM

డిప్యూటీ సీఎంఅంజాద్‌ నుంచి అవార్డు అందుకుంటున్న హలీమా సాదియా, ఆమె తల్లిదండ్రులు   - Sakshi

● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న హలీమా ● విద్యార్థినికి అభినందన వెల్లువ

చౌడేపల్లె: మండలంలోని మేదరదొడ్డికి చెందిన సైకిల్‌ మెకానిక్‌ కరీముల్లా కుమార్తె హలీమా సాధియాకు అరుదైన గౌవరం లభించింది. ఈమె ఉర్దూ మాద్యమంలో జిల్లాలో ఉత్తమ విద్యార్థినిగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా చేతుల మీదుగా అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే చౌడేపల్లె మండలం మేదరదొడ్డికి చెందిన సైకిల్‌ మెకానిక్‌ కరీముల్లా కుమార్తె హలీమా సాదియా దాదేపల్లె ఉర్దూ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈనెల 11వ తేదీన విజయవాడలోని ఏపీ ప్లస్‌ కన్వెక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉత్తమ విద్యార్థినిగా హలీమా సాధియాకు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి, సత్కరించారు. దీంతో ఆమెతోపాటు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాలలో హలీమా ఇంటర్‌ చదవుతోంది. అవార్డు అందుకున్న హలీమాను పలువురు అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement