పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే.. | Today gold and silver rates in Telugu states | Sakshi
Sakshi News home page

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..

May 5 2025 12:15 PM | Updated on May 5 2025 12:23 PM

Today gold and silver rates in Telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.

చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement