టీసీఎస్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది | Tcs Reaching Market Capitalisation Of Rs 15 Lakh Crore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది

Feb 6 2024 9:28 PM | Updated on Feb 6 2024 9:37 PM

Tcs Reaching Market Capitalisation Of Rs 15 Lakh Crore - Sakshi

దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్‌ మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది.

గ్లోబల్ అసిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యూరప్ అసిస్టెన్స్’ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ స్టాక్ నాలుగు శాతానికి పైగా పుంజుకుంది. 

ఈ తరుణంలో యూరప్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నట్లు స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా యూరోప్ అసిస్టెన్స్ సంస్థకు ఐటీ సేవలు అందించేందుకు యూరప్‌లో టీసీఎస్ డెలివరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. యూరోప్ అసిస్టెన్స్ సంస్థతో డీల్ ప్రకారం ఆ సంస్థకు టీసీఎస్ తన ఏఐ యాప్స్‌ సేవలతో పాటు ఇతర అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల వినియోగంలో కలిసి పని చేయనున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement