త్వరలో ఫెడ్‌ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు | stock market updates on January 29 2025 | Sakshi
Sakshi News home page

Stock Market: త్వరలో ఫెడ్‌ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Jan 29 2025 9:23 AM | Updated on Jan 29 2025 9:23 AM

stock market updates on January 29 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ(Nifty) 70 పాయింట్లు లాభపడి 23,021కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 219 పాయింట్లు ఎగబాకి 76,124 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 107.88 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.28 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.92 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 2.03 శాతం ఎగబాకింది.

అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్‌ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయొచ్చనే భయాలు  పెరిగాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement