పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు | stock market updates on January 16 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు

Jan 16 2025 9:54 AM | Updated on Jan 16 2025 11:38 AM

stock market updates on January 16 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నా​యి.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.34 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.83 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 2.45 శాతం ఎగబాకింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్‌బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్‌బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  (డిసెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్‌బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement