రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్‌బీఐ | RBI actively pushing for faster transmission of rate cuts | Sakshi
Sakshi News home page

రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్‌బీఐ

Jun 27 2025 8:44 AM | Updated on Jun 27 2025 8:44 AM

RBI actively pushing for faster transmission of rate cuts

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటును ఈ నెల మొదట్లో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించగా (0.50 శాతం), దీన్ని వేగంగా రుణ గ్రహీతలకు బదలాయించాలంటూ ఆర్‌బీఐ బులెటిన్‌ సూచించింది. బ్యాంక్‌లు వెంటనే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించాలని కోరింది. వాస్తవానికి చాలా బ్యాంక్‌లు ఇప్పటికే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించడం గమనార్హం.

ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్‌ 10 బ్రాండ్లు

రుణ రేట్లను వేగంగా బదలాయించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదితర బ్యంక్‌లు వేగంగా బెంచ్‌మార్క్‌ లెడింగ్‌ రేటు ఆధారిత రుణ రేట్లను సవరించాయి కూడా. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని సైతం (సీఆర్‌ఆర్‌) అర శాతం మేర తగ్గిస్తూ  ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. సీఆర్‌ఆర్‌ కోతతో బ్యాంకింగ్‌ రంగంలోకి రూ.2.5 లక్షల కోట్ల మేర అదనపు నగదు లభ్యత అందుబాటులోకి వచ్చినట్లయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement