Pure EV ePluto 7G Pro Launched at Rs 94,999 up to 150 KM Range - Sakshi
Sakshi News home page

ప్యూర్‌ ఈవీ కొత్త ఈ-స్కూటర్‌: 150 కి.మీ రేంజ్‌, ధర ఎంతంటే?

May 12 2023 6:15 PM | Updated on May 12 2023 6:25 PM

PURE EV ePluto 7G Pro launched at Rs 94,999 up to 150 km range - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్​ ఈవీ  కొత్త ఇ-స్కూటర్‌ను పరిచయం చేసింది. ప్యూర్​ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో పేరుతో  టాప్​ ఎండ్​ మోడల్​ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.  PURE EV ePluto 7G ప్రో రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా ప్రకటించింది. బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించగా, డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయి. (మోటో వాచ్‌ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!)

ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో : బ్యాటరీ, ఫీచర్లు
ఏఐఎస్​ 156 సర్టిఫైడ్​  3.0 kWh బ్యాటరీ ప్యాక్‌, 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులోజత చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపిక చేసిన మోడ్‌ను బట్టి ఒకే ఛార్జ్‌పై 100 -150 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని,  మూడు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. స్మార్ట్​ బీఎంఎస్​, బ్లూటూత్​ కనెక్టివిటీ, రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ లాంటి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. మాట్ బ్లాక్, గ్రే , వైట్ మూడు కలర్ వేరియంట్‌లలో ఇది లభించనుంది.

తమ బెస్ట్​ సెల్లింగ్​ 7జీ మోడల్‌కు ఇది  అప్‌గ్రేడ్ వెర్షన్  అని,  లాంగర్‌ రేంజ్‌ స్కూటర్లను కోరుకునే కస్టమర్ల లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్యూర్​ ఈవీ కో-ఫౌండర్​, సీఈఓ రోహిత్​ వదేరా  లాంచింగ్‌ సందర్బంగా  తెలిపారు.  ప్రీ-లాంచ్ టైంలోనే  5వేల బుకింగ్‌లను అందుకున్నామంటూ సంతోషం ప్రకటించారు.  తొలి నెలలో 2వేలకు పైగా బుకింగ్‌లను ఆశిస్తున్నామన్నారు.

మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల వార్తలకోసం చదవండి  ‘సాక్షి బిజినెస్‌’ మీకెలాంటి వార్తలు కావాలో కామెంట్ల ద్వారా తెలియజేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement