తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ | No Change in Tatkal Ticket Timings IRCTC Tweet | Sakshi
Sakshi News home page

తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ

Apr 12 2025 10:49 AM | Updated on Apr 12 2025 11:15 AM

No Change in Tatkal Ticket Timings IRCTC Tweet

ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్‌సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.

ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement