భారత్‌ వృద్ధి అంచనాలు డౌన్‌ | IMF cuts India growth forecast for FY26 to 6. 2 percent | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనాలు డౌన్‌

Apr 23 2025 4:35 AM | Updated on Apr 23 2025 4:35 AM

IMF cuts India growth forecast for FY26 to 6. 2 percent

6.2 శాతానికి కుదించిన ఐఎంఎఫ్‌

న్యూయార్క్‌: అంతర్జాతీయంగా అనిశి్చతి, వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. ప్రైవేట్‌ వినియోగం దన్నుతో భారత వృద్ధి అంచనాలు కాస్త స్థిరంగా ఉండగలవని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈవో)లో పేర్కొంది. 2025లో గ్లోబల్‌ వృద్ధి గత అంచనాల కన్నా 0.5 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 2.8 శాతంగా ఉండనుంది.

2026లో ఇది 3 శాతంగా ఉండొచ్చు. కెనడా, జపాన్, బ్రిటన్, అమెరికా అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. అమెరికా వృద్ధి గతంలో ఊహించిన దానికన్నా 2.7 శాతం కన్నా చాలా తక్కువగా 1.8% స్థాయిలో ఉంటుందని పేర్కొంది. విధానాలపరమైన అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీన డిమాండ్, ఊహించిన దానికన్నా వినియోగ వృద్ధి నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement