సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ | HDFC Bank Hikes Loan Interest Rates | Sakshi
Sakshi News home page

సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

Nov 7 2024 7:47 PM | Updated on Nov 7 2024 8:00 PM

HDFC Bank Hikes Loan Interest Rates

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్‌లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్‌లు, పర్సనల్ లోన్‌లు, ఆటో లోన్‌లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్‌ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్‌ఆర్‌ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.

కొత్త ఎంసీఎల్‌ఆర్‌లు ఇవే..
ఓవర్ నైట్: 9.15 శాతం
ఒక నెల: 9.20 శాతం
మూడు నెలలు: 9.30 శాతం
ఆరు నెలలు: 9.45 శాతం
ఒక సంవత్సరం: 9.45 శాతం
రెండు సంవత్సరాలు: 9.45 శాతం
మూడు సంవత్సరాలు: 9.50 శాతం

ఎంసీఎల్ఆర్‌ అంటే?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక‌ రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement