బంగారం, వెండి.. దసరా ధమాకా! కొన్నవారిదే పండగ!! | Gold Rate Crashes This Week 24K 22K Gold Silver Prices In Hyderabad other Cities | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి.. దసరా ధమాకా! కొన్నవారిదే పండగ!!

Oct 23 2026 9:41 PM | Updated on Oct 23 2026 9:58 PM

Gold Rate Crashes This Week 24K 22K Gold Silver Prices In Hyderabad other Cities

బంగారం, వెండి ధరలు దసరా ధమాకా చూపించాయి. దసరా పండుగ జరిగిన ఈ వారంలో పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లో 100 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.55,600 పడిపోయింది. అదే తులానికి (10 గ్రాములు) రూ.5,560 తగ్గింది. ఇక వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి.  ఈ వారంలో వెండి ధర కేజీకి రూ.15,000 మేర పతనమైంది.

అక్టోబర్‌ 23న ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,900 పడిపోయి రూ.1,42,480కు చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర సైతం 10 గ్రాములకు రూ.1,750 తగ్గి రూ.1,30,600కు దిగివచ్చింది. వెండి ధరలు కూడా కేజీకి రూ.5000 మేర క్షీణించి రూ.2.20 లక్షల స్థాయికి వచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బలహీనత

ప్రపంచ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు బలహీనపడటం దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాలర్ల స్థాయిని దాటడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన అంచనాలు బలపడటం పసిడిపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ ఎంసీఎక్స్‌ బంగారం ధర రూ.1.42 లక్షల స్థాయికి దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 4,000 డాలర్ల స్థాయికి చేరువైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement