తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ ఇలా.. | Today Gold And Silver Prices May 27th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ ఇలా..

Published Mon, May 27 2024 11:29 AM

gold price today silver rate may 27

దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 27) స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఎగిశాయి. తులం బంగారం (10 గ్రాములు) రూ.710 మేర పెరిగి పసిడి కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళనలు పెంచుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో.. 
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ. 72,710 లను తాకింది.

ఇతర నగరాల్లో.. 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,800 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 పెరిగి రూ.72,860 లకు చేరింది. 
ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.72,710లకు ఎగిసింది.

ఇక చెన్నైలో పసిడి ధరలు అత్యధికంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.67,200 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.710 పెరిగి రూ.73,310 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.72,710 వద్దకు చేరింది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు (మే 27) వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఈరోజు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,500లుగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
 
Advertisement