గోల్డెన్‌ ఛాన్స్‌! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే.. | Today Gold And Silver Prices April 8th, 2025 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: గోల్డెన్‌ ఛాన్స్‌! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..

Apr 8 2025 9:43 AM | Updated on Apr 8 2025 10:21 AM

gold and silver rates today on market in telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.

ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు

వెండి ధరలు

బంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement