మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే.. | gold and silver rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..

Dec 3 2024 12:32 PM | Updated on Dec 3 2024 3:03 PM

gold and silver rates today on market in telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా మూడు రోజులపాటు తట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,300 (22 క్యారెట్స్), రూ.77,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.430 పెరిగింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,780 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.77,930 వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు

బంగారం ధరలు పెరిగినప్పటికీ..వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది. నిన్న మాత్రం కేజీపై రూ.500 తగ్గింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement