అలా తగ్గి ఇలా.. నేటి బంగారం ధరలు | Gold and Silver Price Today On 7 December 2024 | Sakshi
Sakshi News home page

అలా తగ్గి ఇలా.. నేటి బంగారం ధరలు

Dec 7 2024 12:08 PM | Updated on Dec 7 2024 12:17 PM

Gold and Silver Price Today On 7 December 2024

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. క్రితం రోజున మోస్తరుగా క్షీణించిన పసిడి రేట్లు నేడు  (డిసెంబర్‌ 7) నిలకడగా కొనసాగుతున్నాయి. మొత్తంగా డిసెంబర్‌ తొలి వారంలో బంగారం ధర 10 గ్రాములపై సుమారు రూ.900 మేర తగ్గగా, రూ.500 మేర పెరిగింది.

తెలుగు రాష్ట్రాలో పసిడి ధరలు 
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  తెలుగు రాష్ట్రాలోని  వివిధ ప్రాంతాల్లో  ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం క్రితం రోజులతో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా రూ.71,150 వద్ద ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ.77,620 దగ్గర ఉంది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.77,770 వద్ద ఉన్నాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,150, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,620 లుగా కొనసాగుతున్నా​యి.

ఇదీ చదవండి: భారత్‌ బంగారం.. 882 టన్నులు

వెండి ధరలు
ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement